
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
గూడూరు వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన హత్య కేసులో నిందితుడు వింగవాసం జోగేంద్ర అలియాస్ జోగికి 7వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రైల్వే స్టేషన్ సమీపంలోని RMS కార్యాలయం వద్ద కాంక్రీట్ బ్లాక్తో వ్యక్తి తలపై దాడి చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.




























