
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కి నివాళులుఅర్పించిన బిజెపి నేతలు
పామూరులోని మండల బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతే నిజమైన అభివృద్ధి అనే అంత్యోదయ సిద్ధాంతాన్ని దేశానికి అందించిన మహనీయుడు దీన్‌దయాళ్ అని బీజేపీ నాయకులు శ్రీను, విజయ్, శివ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.





























