Sep 08, 2026, 10:09 IST/
భార్యను చంపి తలను ఫ్రిజ్లో పెట్టిన కేసులో కొత్త విషయాలు
Sep 08, 2026, 10:09 IST
భార్యను హత్య చేసి, ఆమె తలను ఫ్రిడ్జ్లో పెట్టిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రామానుజ్ గోస్వామి గౌహతి కోర్టుకు వెళ్తుండగా.. 'నేను నా భార్యను చంపాను. జైలు నుంచి విడుదలయ్యాక 'షుగర్ డాడీ' అని పిలిచే వ్యక్తిని కూడా తప్పకుండా చంపుతా' అని ప్రకటించారు. తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్షమాపణలు కూడా లేవని ఆయన అన్నారు. కాగా భార్య మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే కోపంతో రామానుజ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.