Sep 30, 2026, 04:09 IST/
బస్సులో బాలికపై అత్యాచారం ఘటన.. ఆధారాలు లభ్యం
Sep 30, 2026, 04:09 IST
ఢిల్లీ పోలీసులు బస్సులో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో 398 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై 11 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, నిందితులకు పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలు కల్పించారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సంఘటన జరిగినప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదని, కిటికీలకు భారీ తెరలు ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానం విచారణకు అంగీకరించింది. ఈ కేసులో కీలక ఆధారాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.