
విద్యుదాఘాతంతో మహిళ మృతి
తర్లుపాడు మండలంలోని తాడి వారి పల్లి గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రైతు తాడి మహాలక్ష్మి (30) వరి పంటకు నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లి, మోటర్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తర్లుపాడు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.





























