నాగులుప్పలపాడు - Naguluppalapadu

మంచిర్యాల జిల్లా
తెలంగాణ ఎమ్మెల్సీ టిక్కెట్లు రెడ్లకేనా? కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?
Sep 28, 2026, 16:09 IST/

తెలంగాణ ఎమ్మెల్సీ టిక్కెట్లు రెడ్లకేనా? కాంగ్రెస్ ప్లాన్ ఇదేనా?

Sep 28, 2026, 16:09 IST
తెలంగాణలో 2027లో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఖమ్మం-నల్గొండ-వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టిక్కెట్లు దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. ఖమ్మం-నల్గొండ-వరంగల్ నుంచి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి లేదా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌లలో ఒకరికి, రంగారెడ్డి-హైదరాబాద్-పాలమూరు నుంచి మన్నే జీవన్ రెడ్డి లేదా సామ రామ్మోహన్ రెడ్డిలలో ఒకరికి టిక్కెట్ దక్కవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.