
గుండెపోటుతో జిల్లాకు చెందిన సీఐడీ ఎస్సై మృతి
నెల్లూరు సీఐడీ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న చేవూరి ప్రభాకరరావు (57) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన రోజు ఒంగోలు నుంచి నెల్లూరు కు రైలులో వెళ్లి విధులు నిర్వహించేవారు. శనివారం విధులు ముగించుకుని రైలులో ఒంగోలుకు చేరుకున్నాక ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబీకులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఆదివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధి టీఆర్ నగర్ కు తరలించి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
































