
స్వర్ణ కంకణ పురస్కారానికి పర్చూరు MEO ఎంపిక
పర్చూరు మండల విద్యాధికారి అల్లూరి శివ కోటేశ్వరరావు సాహితీ, ఆధ్యాత్మిక సేవా రంగాల్లో విశిష్ట కృషి చేసినందుకు స్వర్ణ కంకణ పురస్కారం–2026కు ఎంపికయ్యారు. తెలుగు భాషా సాహితీ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఈ పురస్కారానికి ఆయన ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాన్ని అదివారం వరంగల్లో జరిగే కార్యక్రమంలో ఆయన అందుకోనున్నారు. శివ కోటేశ్వరరావుకు పలువురు అభినందనలు తెలిపారు.




































