
పొదిలిలో కమిషనర్ ఆంజనేయులు పారిశుద్ధ్య పరిశీలన
పొదిలిలోని పలు వార్డులను కమిషనర్ ఆంజనేయులు శుక్రవారం పరిశీలించారు. దుకాణదారులు చెత్త, టీ కప్పులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేయకుండా కేటాయించిన డబ్బాలలో వేయాలని సూచించారు. డస్ట్ బిన్లలో వేసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి తీసుకెళ్తారని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ పొదిలికి దుకాణదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.











