Sep 02, 2026, 17:09 IST/
బీఆర్ఎస్లో మళ్లీ యాక్టివ్ అయిన మల్లారెడ్డి
Sep 02, 2026, 17:09 IST
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనను నిరసిస్తూ బోడుప్పల్లో జరిగిన ర్యాలీలో ఆయన కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. గతంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వేరే పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో, ఆయన రాజకీయ వ్యూహంపై చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తూ, చివరిలో అనూహ్య మలుపు తిప్పే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.