Sep 26, 2026, 05:09 IST/
ఒడిశాలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం (వీడియో)
Sep 26, 2026, 05:09 IST
ఒడిశాలోని ఖోర్ధా జిల్లా బాణ్పూర్లో కుండపోత వర్షాల కారణంగా తీవ్ర వరదలు ముంచెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాణ్పూర్-బాలుగావ్ ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయాయి, నివాస ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.