
వినాయక చవితి ప్రశాంతంగా జరుపుకోవాలి
సంతనూతలపాడు మండల ప్రజలు వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని S. N. పాడు SI v. అజయ్ బాబు మంగళవారం తెలిపారు. వినాయక మండపాలను ఏర్పాటు చేసే ప్రతి కమిటీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా నిర్వాహకులు ఎప్పుడూ ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లను కాపలాగా ఉంచాలని పేర్కొన్నారు.




















