Sep 26, 2026, 17:09 IST/మంచిర్యాల
మంచిర్యాల
కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లు: హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపు
Sep 26, 2026, 17:09 IST
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ల యూనియన్లు తమ డిమాండ్ల సాధనకై శనివారం సూపరింటెండెంట్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించాయి. కనీస వేతనం రూ. 26,000, ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, రూ. 20 లక్షల ప్రమాద బీమా, ప్రతి కార్మికునికి ఈఎస్ఐ వర్తింపజేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరేష్ కోరారు. ఈ డిమాండ్ల సాధనకై సెప్టెంబర్ 28న హైదరాబాద్ కోఠిలో నిర్వహించే మహాధర్నాలో జిల్లా కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.