
తుమ్మలచెరువు దర్గా ఉత్సవాలు: సోదరభావానికి, సామరస్యానికి ప్రతీకగా
తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలోని హజరత్ ఖాసీం స్వామి దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముజావర్ సయ్యద్ ఇమాంస తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 22న చిన్న షరగత్, 25న పెద్ద షరగత్, 26న నీళ్ల బడే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలు సోదరభావానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారని ఆయన పేర్కొన్నారు.













