
త్రిపురాంతకం పాఠశాల కమిటీకి కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
త్రిపురాంతకం మండలంలోని స్థానిక అంబేద్కర్ కాలనీ ప్రాధమిక పాఠశాల కమిటీ చైర్మన్ గా బొందలపాటి వెంకట దుర్గ, వైస్ చైర్మన్ గా గుమ్మడి జేమ్స్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం డీలర్, టీడీపీ నాయకులు బొందలపాటి శాంతారావు, బుజ్జి, బాల నాసర్ (శశి బిల్డర్స్), చిన్న అంకారావు, జి. నాసరయ్య, ఉపాధ్యాయులు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.































