
గిద్దలూరులో భక్తిశ్రద్ధలతో దసరా నవరాత్రి ఉత్సవాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూలవిరాట్ అమ్మవారు ధనలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆర్యవైశ్య మహిళలు మంత్రపుష్పం సమర్పించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమ వివరాలను దేవస్థానం ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.



































