
పామూరు ఎంపీటీసీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా విజయ్ కుమార్ చారి
ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజకవర్గంలోని పామూరు పట్టణ రెండో ఎంపీటీసీ స్థానాన్ని ప్రభుత్వం బీసీ వర్గానికి కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ యువజన సంఘం మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా బీసీ నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వ్యూహరచన చేస్తున్నారు.































