
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
టంగుటూరులోని 16వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఓ బేకరీ సమీపంలో నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి ఒంగోలుకు వెళ్తున్న కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. జాతీయ రహదారి నుంచి బస్సు సర్వీస్ రోడ్డులోకి యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా తరలించారు.























