
మానవత్వం చాటిన మానవతా స్వచ్చంద సేవా సంస్థ
ఒంగోలులో గోపాల్ నగర్ నందు నివసిస్తున్న బెజవాడ బుజ్జమ్మ భర్త రమేష్ అనారోగ్యంతో మరణించారు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బుజ్జమ్మ ఆమె కుమార్తె ఒంగోలు గోపాల్ నగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారిని ఇంటి యజమాని రావొద్దని చెప్పగా ఆరామ క్షేత్రంలో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న సంస్థ ఆదుకుంది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ బెజవాడ రమేష్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాలని సూర్య శ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ షేక్ సర్దార్ భాష కు తెలపగా, సంస్థ తరపున సహాయం అందించినట్లు తెలిపారు.





























