
ఉరేసుకొని జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో, డీఎల్ఎఫ్ సమీపంలోని VR ఎలైట్ ప్రీమియం ఉమెన్స్ హాస్టల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మనీషా ఆత్మహత్య చేసుకుంది. తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ నోట్లో 'నాన్న, మీ అంచనాలను నేను అందుకోలేకపోతున్నాను' అని రాసింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. నానక్‌రాంగూడలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






























