నేడు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

1చూసినవారు
నేడు ఏపీలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. సాయంత్రం 6:25 గంటలకు గన్నవరం చేరుకుని, రాత్రి 7:10 నుండి 7:40 గంటల మధ్య అమ్మవారి ప్రత్యేక పూజలు, దర్శనంలో పాల్గొంటారు. నేడు అమ్మవారు 'శ్రీ మహాచండీ దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నోవాటెల్ హోటల్‌లో బస చేసి, అక్టోబర్ 15న 'సరస్ మేళా'ను ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్