AP: స్థానిక ఎన్నికల వివాదంపై
వైసీపీ అధినేత
జగన్ సంచలన ట్వీట్ చేశారు. ‘ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండో రోజూ చంద్రబాబు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
టీడీపీ మూకలకు గూండా లైసెన్స్లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్రాజ్ను నడిపిస్తున్నారు’ అని
జగన్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు.