AP: తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం పోతవరంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి అటుగా వెళ్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన ముసునూరి వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.