
మద్యం షాపుల రెన్యువల్ గడువు ముగింపు
ఆంధ్రప్రదేశ్లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియకు గడువు ముగిసింది. ఇకపై గడువు పొడిగించకూడదని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. అర్ధరాత్రి వరకు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. రెన్యువల్ RET మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే పరిగణిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,650 షాపులను రెన్యువల్కు నోటిఫై చేయగా, 3,236 ముందుకు వచ్చాయి.




