ప్రజా సేవే మా అజెండా: కొడాలి నాని (వీడియో)

4చూసినవారు
AP: అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే తమ అజెండా అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, కలిసికట్టుగా పోరాడుదామని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు. 2029లో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. కూటమి నేతలు భయపెట్టే ప్రయత్నం చేస్తారని, ఎవరూ భయపడొద్దని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్