పులివెందులలో ఎంపీపీ ఎన్నిక వాయిదా

29చూసినవారు
పులివెందులలో ఎంపీపీ ఎన్నిక వాయిదా
AP: కడప జిల్లా పులివెందులలో ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. రిజర్వేషన్ల ప్రకారం ఎంపీపీ అధ్యక్ష పదవి ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించగా, ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు లేకపోవడంతో ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. అధ్యక్ష పదవికి అవసరమైన రిజర్వేషన్ ప్రకారం సభ్యుడు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్