తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డి, సిరిసిల్ల, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, భద్రాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. ఇక ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.