AP: గుంటూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గంటసేపటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి లక్ష్మీపురం మెయిన్ రోడ్డుతో పాటు పలు ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇక అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారలు సైతం హెచ్చరించారు.