వచ్చే 3 రోజులు ఏపీలో మళ్లీ వర్షాలు

18చూసినవారు
వచ్చే 3 రోజులు ఏపీలో మళ్లీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌, యానాం పరిసర ప్రాంతాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాంధ్రలో ఆదివారం, సోమవారం అక్కడక్కడా వర్షాలు, మంగళవారం ఒకటి రెండు చోట్ల జల్లులు పడొచ్చంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులూ పలుచోట్ల వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు, రైతులు, కూలీలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్