బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అధికారి వెల్లడించారు. ఈ ద్రోణి ఇవాళ తీరాన్ని తాకడంతో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అంతేకాకుండా, గరిష్ఠంగా గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.