కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు

10899చూసినవారు
కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు
AP: అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

సంబంధిత పోస్ట్