వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో వర్షాలు

91చూసినవారు
వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో వర్షాలు
AP: బంగాళాఖాతంలో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. కొమొరిన్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకు ఈ ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్