AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా తాజా హెచ్చరికల కోసం అధికారిక IMD వెబ్‌సైట్‌ను గమనించవలసిందిగా కోరారు.