రాజమండ్రి ఎన్నికలు రద్దు.. నిర్ధారించిన ఎస్ఈసీ

16చూసినవారు
రాజమండ్రి ఎన్నికలు రద్దు.. నిర్ధారించిన ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం ఎన్నికలు రద్దు అయ్యాయి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌లో పలు గ్రామాలను ప్రభుత్వం విలీనం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ నెల 28న రాజమండ్రి మినహా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మిగిలిన కార్పొరేషన్లలో ఎన్నికలు యథావిథిగా జరగనున్నాయి. పలు గ్రామాలను ఏకపక్షంగా విలీనం చేశారని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తుది తీర్పునకు లోబడి విలీనం ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రిలో ఎన్నికలు నిలిపివేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్