AP: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన విద్యార్థుల్లో చెదిరిపోని భయాన్ని నింపింది. భయాందోళనకు గురైన విద్యార్థుల్లో మానసిక భరోసా కల్పించేందుకు 20 మంది నిపుణులతో కూడిన బృందం రంగంలోకి దిగింది. పదో తరగతికి చెందిన 32 మంది విద్యార్థుల ఇళ్లకు మానసిక ఆరోగ్య నిపుణులు వెళ్లి కౌన్సెలింగ్ అందిస్తున్నారు. విద్యార్థుల్లో భయాందోళనలు తొలగించి.. ఆత్మవిశ్వాసం పెంచడం సహా వాళ్లు తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.