AP: అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని కర్నూలు సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన హేమంత్‌కు కార్డియాలజీ విభాగంలో 4 రోజులపాటు చికిత్సలు అందించడంతో కోలుకున్నాడని, బుధవారం అతడిని డిశ్ఛార్జ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా జైలు అధికారులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.