
చంద్రుడిపై అణు రియాక్టర్లు.. అమెరికా, రష్యా మధ్య పోటీ
చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద పనిచేసే అణు రియాక్టర్లను సిద్ధం చేసేందుకు నాసా ప్రణాళికలు రూపొందిస్తోంది. 2030 డిసెంబర్ నాటికి ప్రయోగానికి సిద్ధం చేయాలని అమెరికా భావిస్తోంది. మరోవైపు రష్యా కూడా చైనాతో కలిసి ‘సెలీనా’ పేరుతో ఓ రియాక్టర్‌ను అభివృద్ధి చేస్తుంది. 2036 నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటుకు విద్యుత్ కీలకం, సౌర విద్యుత్‌కు రెండు వారాల చీకటి సమస్యగా మారనుంది. అణు రియాక్టర్లు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించగలవు.




