AP: కృష్ణా జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో
టీడీపీ ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం మరియు పామర్రు నియోజకవర్గాలలో పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. పామర్రులో నన్నపనేని వీరేంద్ర, గన్నవరంలో యారగాని రత్తయ్య, సొంఠి కిషోర్ బాబు భారీ మెజారిటీతో గెలుపొందారు. తమకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో బరిలోకి దిగిన వీరు గెలిచి పార్టీ నాయకత్వాన్ని విస్మయానికి గురిచేశారు.