బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రముఖ డాక్టర్ లావణ్య మృతి

18చూసినవారు
బ్రెయిన్ స్ట్రోక్‌తో ప్రముఖ డాక్టర్ లావణ్య మృతి
AP: నెల్లూరు అర్బన్‌లోని మాగుంట లేఅవుట్‌లో ఎనెల్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్, న్యూరాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ కుంకాల లావణ్య (31) శనివారం బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హఠాన్మరణం చెందారు. తక్కువ ఫీజులతో రోగులకు వైద్యం అందిస్తూ గుర్తింపు పొందిన ఆమె, వారం రోజుల క్రితం జైపూర్‌లో జరిగిన 33వ ఇండియన్‌ అకాడమి ఆఫ్‌ న్యూరాలజీ వార్షిక సదస్సులో తన వ్యాసానికి ప్రశంసలు అందుకున్నారు. ఆమె అకాల మృతిపై ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు, సెక్రటరీ కమల్‌కిరణ్‌లు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్