నేడు ఈ పంచాయతీల్లో రిపోలింగ్

11చూసినవారు
నేడు ఈ పంచాయతీల్లో రిపోలింగ్
AP: రాష్ట్రంలోని మూడు పంచాయతీల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, బ్యాలెట్ పేపర్లు చించివేత, ఇంకు పోయడం వంటి అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో సర్పంచ్, ఒకటో వార్డుకు, గరికపాడు సర్పంచ్ స్థానానికి, సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నర్సంపల్లిలో సర్పంచ్, 7వ వార్డుకు నేడు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్