AP:
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి రోజా ఫోన్లో పరామర్శించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. నామినేషన్లకు వెళ్లే
వైసీపీ అభ్యర్థులపై దాడులను ఖండించారు. ఓటమి భయంతోనే హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిథున్ రెడ్డిపై దాడి పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. దాడులపై న్యాయస్థానాలు సుమోటోగా స్పందించాలని రోజా డిమాండ్ చేశారు.