రూ.1.48 కోట్ల నగదు స్వాధీనం (వీడియో)

13చూసినవారు
మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో భారీగా హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 1.48 కోట్లు సీజ్ చేశారు. ఛత్ పూజ రద్దీ నేపథ్యంలో ‘ఆపరేషన్ సతర్క్’ పేరుతో నాసిక్ రోడ్ స్టేషన్‌లో ఆర్పీఎఫ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ప్లాట్‌ఫామ్-3పై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వద్ద బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా రూ.1,48,64,000 నగదు లభ్యమైంది.

సంబంధిత పోస్ట్