సర్పంచ్ పదవికి రూ. కోటి అడ్వాన్స్

204చూసినవారు
సర్పంచ్ పదవికి రూ. కోటి అడ్వాన్స్
AP: ఏలూరు జిల్లా, నిడమర్రు మండలం పెదనిండ్రకొలను పంచాయతీ ఎన్నికల్లో వినూత్న ఒప్పందం జరిగింది. కూటమి అభ్యర్థి వర్రి త్రివేణి, వైసీపీ మద్దతుదారు నక్కా త్రివేణిలు ఓటర్లకు డబ్బులు పంచకుండా, చెరో కోటి రూపాయలను గ్రామ అభివృద్ధికి కేటాయించేలా గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే, ఈ విషయాన్ని నక్కా త్రివేణి తన పార్టీ నేతలకు తెలపలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుండి నక్కా త్రివేణి భర్త రామకృష్ణ కనిపించకపోవడంతో ఆమె మద్దతుదారుల శిబిరంలో తీవ్ర కలకలం మొదలైంది.

సంబంధిత పోస్ట్