ఆ ఊరిలో ఓటుకు రూ.25 వేలు!

58చూసినవారు
ఆ ఊరిలో ఓటుకు రూ.25 వేలు!
AP: మార్కాపురం జిల్లా సి.ఎస్‌.పురం మండలం అయ్యలూరివారిపల్లిలో ఓటుకు భారీగా నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.25 వేలు, మరో పార్టీ మద్దతుదారు రూ.15 వేలు, రెబల్ అభ్యర్థి రూ.20 వేల చొప్పున ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో సర్పంచి పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 841 మంది ఓటర్లు ఉన్నారు. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్న గ్రామ ఓటర్లను రప్పించేందుకు ప్రయాణ ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్