ఏపీ రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు కుటుంబ సభ్యులు ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న కొనకళ్ల నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించి, ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.