AP: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల దాడిలో సాయికృష్ణ మరణించినట్లు సిట్ పేర్కొంది. సాయికృష్ణ అరెస్టు, పోలీసుల దాడి, హత్యపై ఆధారాలను సమర్పించింది. అతడి అదృశ్యం నుంచి మృతి వరకు జరిగిన పరిణామాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చి, వారిని అరెస్ట్ చేసింది.