సాయికృష్ణ డెత్ కేసు.. విజయవాడకు సీబీఐ

7చూసినవారు
సాయికృష్ణ డెత్ కేసు.. విజయవాడకు సీబీఐ
AP: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు విచారణలో భాగంగా, సీబీఐ బృందం విజయవాడ చేరుకుంది. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన అధికారులు, సీబీఐ అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తును ప్రారంభించారు. విచారణలో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనూ విచారణ చేపట్టనున్నారు. అలాగే, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి చేరుకుని వివరాలు సేకరించనున్నారు. ఘటన జరిగిన తీరుపై స్పష్టత కోసం సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ ప్రక్రియను చేపట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్