AP: ప్రకాశం జిల్లా తీరప్రాంతంలో ఉప్పు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో ఉప్పు దిగుబడి భారీగా పెరిగింది. దీంతో టన్ను ధర రూ.1,000కు పడిపోయింది. గతంలో టన్ను రూ.2,500 నుంచి రూ.4,000 వరకు పలికేదని రైతులు చెబుతున్నారు. ధర పెరుగుతుందనే ఆశతో పంటను పొలాల్లోనే రాశులుగా పోసి కవర్లు కప్పారు. ప్రస్తుతం తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు కిలో ఉప్పును రూ.1కే వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.