AP:
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కంచల గ్రామంలో సర్పంచ్
ఎన్నికలు ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన సోదరులు ప్రత్యర్థులుగా నిలవడం గమనార్హం. వైఎస్సార్సీపీ మద్దతుతో రామిరెడ్డి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా, కూటమి తరపున ఆయన తమ్ముడు రామిరెడ్డి సుబ్బారావు బరిలో ఉన్నారు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో గ్రామంలో స్థానికంగా ఈ
ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ సభ్యులే రాజకీయంగా విరుద్ధ పక్షాల్లో నిలబడటంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.