AP: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ గురువారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓటు వేసేందుకు మరో 25 నిమిషాలే సమయం ఉండటంతో ఓటర్లు వెంటనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.